ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు సాగాలి..ఏసీపీ మాధవి:

huzurabad-acp.

విద్యార్థులు ఎలాంటి దిగులు భయం లేకుండా పరీక్షలు రాయాలి…

డీసీ తెలుగు శంకరపట్నం
విద్యార్థిని విద్యార్థులకు తొలి మెట్టు పదో తరగతి కామన్ పరీక్ష లేనని, ఎలాంటి దిగులు లేకుండా ఉన్నత చదువులే లక్ష్యంగా తరగతి పరీక్షలు రాయాల‌ని హుజూరాబాద్ ఏసీపీ మాధ‌వి  (huzurabad acpmadhavi) అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం మోడల్ స్కూల్ లో పోలీసులు మీకోసం (mekosam) అనే కార్యక్రమాన్ని సోమ‌వారం కేశపట్నం ఎస్ ఐ కట్కూరి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ మాధవి మాట్లాడారు. విద్య దశలో తొలిమెట్టు పదో తరగతి కామన్ పరీక్ష లేనన్నారు. ఉన్నత చదువులే లక్ష్యంగా శ్రద్ధతో చదివి మేధస్సును పెంచుకొని పదో తరగతి కామన్ పరీక్షలు రాసి 10/10 జిపిఎస్ సాధించాల‌న్నారు. ఉన్నత చదువులకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.


keshapatanm-model-school

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ సిపి గౌస్ అలం (Karimnagar cp)ఆధ్వ‌ర్యంలో పోలీసులు మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న‌ట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి నేరాలు-ఘోరాలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్, కేశపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కే శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చద‌వండి.. 👇👇

తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు 

రామగుండం కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు: బహిరంగ మద్యపానం, డీజేలపై నిషేధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *