తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగష్టు 07న నిర్వహించే “జాతీయ చేనేత దినోత్సవం” సందర్భంగా, చేనేత రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కళాకారులకు, డిజైనర్లకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను (Konda Laxman Bapuji Awards 2026) అందజేస్తుంది. ఈ మేరకు 2026 సంవత్సరానికి గాను అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు కరీంనగర్ చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు జి. రాఘవ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. (Handloom Awards Telangana, Weaver Awards Karimnagar)
ముఖ్యమైన వివరాలు (Eligibility Criteria):
| విభాగం | వయస్సు పరిమితి (31.12.2025 నాటికి) | పని అనుభవం |
| చేనేత కళాకారులు | 30 సంవత్సరాలు నిండి ఉండాలి | కనీసం 10 సంవత్సరాలు |
| చేనేత డిజైనర్స్ | 25 సంవత్సరాలు నిండి ఉండాలి | కనీసం 05 సంవత్సరాలు |
దరఖాస్తు ప్రక్రియ:
-
దరఖాస్తు ఫారమ్: నిర్ణీత దరఖాస్తు ఫారమును పూర్తి చేయాలి.
-
అనుబంధ పత్రాలు: మీ నైపుణ్యానికి సంబంధించిన వివరాలు మరియు నమూనాలు (Samples) జతచేయాలి.
-
చివరి తేదీ: 15 మార్చి 2026 లోపు సమర్పించాలి.
దరఖాస్తు అందజేయాల్సిన కార్యాలయం: (Karimnagar Handloom Department)
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట పొన్న కాంప్లెక్స్లోగల చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు
