కేశవపట్నం గ్రామాన్ని సుందరీకరించడమే లక్ష్యం..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామం రూపురేఖలు మారుస్తాం…
గ్రామ ఉపసర్పంచ్ విజయ్ కుమార్..
డిసి : శంకరపట్నం:
గ్రామాన్ని పచ్చదనం తో, పారిశుద్ధ్యం నివారించి, గ్రామాన్ని సుందరీకరించడమే గ్రామ పాలక వర్గ లక్ష్యమని, కేశవపట్నం గ్రామ ఉపసర్పంచ్ ఆకుపత్తిని విజయ్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించే ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కేశవపట్నం బస్టాండ్ ఆవరణలో పారిశుద్ధ్య నివారణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ విజయకుమార్ మాట్లాడారు. కేశవపట్నం గ్రామాన్ని కాలుష్య నివారణ కోసం, పర్యావరణ పచ్చదనం కోసం. పారిశుద్ధ్య నివారణ చేపట్టి గ్రామాన్ని సుందరీకరించడమే పాలకవర్గ లక్షణం. కేశవపట్నం గ్రామ రూపురేఖలు మార్చి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పంజాల సంపత్ గౌడ్, మోయిన్, గోల్లిపల్లి శ్రీనివాస్, పంచాయతి కార్యదర్శ నరసయ్య, తదితరులు ఉన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *