- Molangur”
అగ్ని గుండాలు, కళ్యాణ మహోత్సవానికి ఘన ఏర్పాట్లు
| శంకరపట్నం:
కోరిన కోరికలు తీర్చి భక్తుల ఇండ్లలో కొంగు బంగారమై వెలిసే శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో గంగరంగా వైభవంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గొల్యాల గంగాధర్ స్వామి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకతీయ–నైజాం కాలం నాటి చరిత్ర కలిగిన మొలంగూర్ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రతి ఏట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్
2026 పేట సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

-
ప్రారంభం: 14వ తేదీ (బుధవారం)
-
ముఖ్య కార్యక్రమాలు:
-
అగ్ని గుండాల కార్యక్రమం
-
భక్తుల ప్రవేశం
-
శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం
-
అనంతరం అన్నదాన వితరణ
-
-
ముగింపు: 17వ తేదీ తెల్లవారుజాము
రవాణా సౌకర్యాలు
మొలంగూర్ గ్రామం కరీంనగర్ పట్టణం నుండి సుమారు 25 కిలోమీటర్లు, వరంగల్ పట్టణం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ద్వారా బస్సు సౌకర్యం కూడా కల్పించబడిందన్నారు.
భక్తులకు పిలుపు
భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు హాజరై శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు గొల్యాల గంగాధర్ స్వామి కోరారు.
Karimnagar’ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జాతీయ, సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
Karimnagar” జపాన్ పర్యటనకు ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని
