పాడి పశువులతో కుటుంబ ఆర్థిక ఎదుగుదల  

సర్పంచ్ లావణ్య శ్రీనివాస్…
డిసి :శంకరపట్నం:
పాడి పశువుల పెంపకంతో కుటుంబాలు ఆర్థికంగా ఎదగవచ్చునని గ్రామ సర్పంచ్ చింతల లావణ్య శ్రీనివాస్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట మండల చింతల పల్లె గ్రామంలో మొలంగూర్ పశు వైద్యశాల అధికారి వి మాధవరావు ఆధ్వర్యంలో ఉచిత పశు పశు వైద్య శిబిరం నిర్వహించి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ ముఖ్య అతిధి హాజరై పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పాడి పశువుల పెంపకంతో కుటుంబాలు ఆరోగ్యముతో పాటు ఆర్థిక ఎదుగుదల పొందవచ్చునని ప్రతి ఇంటికి పాడి పశువు ఎంతో మేలు చేస్తుందని, పాడి పశువుల పెంపకంతో కుటుంబాలు ఆర్థికంగా ఎదగవచ్చునని సూచించారు. ఇంటికి ఒక పాడి పశువు తప్పక ఉండే విధంగా గ్రామ ప్రజలు రైతులు పశువుల పెంపకం చేయాలని గ్రామ ప్రజలను సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జి రణధీర్ రెడ్డి, పశు వైద్యాధికారి వీ మాధవరావు సిబ్బంది పాడి పశువుల పెంపకం దారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *