Local News” భూ భారతితో రైతుల భూ సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారం…

Local News”  భూ భారతితో రైతుల భూ సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారం…

భూభారతి ఆర్ఓఆర్ చట్టం రైతులకు లాభదాయకం…
కలెక్టర్ పమేల సత్పతి… 


శంకరపట్నం డిసీ ప్రతినిధి
భూ భారతి ఆర్ఓఆర్ చట్టంతో క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన‌ట్టు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, త‌హ‌సిల్దార్ బత్తుల భాస్కర్ ఆధ్వర్యంలో భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం అవగాహన సదస్సును గురువారం కేశవపట్నం శివారులోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్, పహలగామ్ లో ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి కోసం మౌనం పాటించి నివాళి అర్పించారు. భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా క‌రీంన‌గ‌ర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పత్తి హాజ‌రై మాట్ల‌డారు. భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రైతులు భూ భారతి ఆర్ వో ఆర్ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలైనా తాసిల్దార్, ఆర్డీవో కు కలెక్టర్లకు దరఖాస్తులు చేసుకుంటే శాఖ పరంగా అధికారులు క్షేత్రస్థాయిల విచారణ చేపట్టి తగిన‌ న్యాయం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, హుజరాబాద్ ఆర్డిఓ రమేష్, తాసిల్దార్ బత్తుల భాస్కర్, ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ పార్థసారథి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ప్రత్యూష,, బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, మండల మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చింతి రెడ్డి పద్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ శ్రీనివాసరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెపు అజయ్, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

/////////////////////////////////////////////////////////////////////////

ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన సిపిఐ పార్టీ…
జిల్లా కార్యదర్శి వెంకటస్వామి… 


శంకరపట్నం డిసీ ప్రతినిధులు
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మతవిద్వేషాలను రెచ్చగొడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి ఉగ్రవాదుల దాడికి కారణం అయ్యారని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెంకటస్వామి మాట్లాడారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్, పహలగామ్ లో ఉగ్రవాదులు చొరబడి పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పర్యాటకుల మరణానికి కారణమైన, ఉగ్రవాదుల చర్య ను సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మతవిద్వేషాలు విడనాడి శాంతియా రాజ్యాంగబద్ధంగా చర్చలు జరిపాల‌న్నారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి సమ్మయ్య సహాయ కార్యదర్శి కన్నం సదానందం, శంకరపట్నం మండల పరిషత్తు తాజా మాజీ కోఆప్షన్ సభ్యులు ఖాజా పాషా, నాయకులు గోదారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *