ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్…
డిసి, శంకరపట్నం:
15 ఆర్థిక సంఘం నిధుల వినియోగం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చేపట్టి గ్రామాల అభివృద్ధికి గ్రామ ప్రథమ పౌరులు, సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గోల్కొండ కృష్ణ ప్రసాద్ సర్పంచులకు సూచించారు. శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2023-2024, 2024-2025 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ అవగాహన సదస్సు నిర్వహించి క్షేత్రస్థాయిలో సర్పంచులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం జిపిడిపీ పనుల ప్రకారం పనులను చేపట్టాలి, గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ సభలో చర్చించి గ్రామసభలో తీర్మానం చేపట్టాలన్నారు గ్రామాల్లో శాశ్వత గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడి భవనం, ఆరోగ్యం మౌలిక సదుపాయాల కోసం సబ్ సెంటర్ల నిర్మాణం, పాఠశాలలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించుటకు 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వినియోగించి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని అవగాహన సదస్సులో సర్పంచులకు సూచించారు. ఈ అవగాహన సదస్సులో తాసిల్దార్ కే సురేఖ ,ఎంపీ ఓ ప్రభాకర్, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు : కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకలెక్టర్లు
ఎసీ (AC) Vs ఎయిర్ కూలర్: ఈ వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్? పూర్తి వివరాలు ఇవే!
