Raksha Bandhan”శంకరపట్నంలో రక్షాబంధన్ హర్షాతిరేకం – అన్నాచెల్లెళ్ల మధ్య ఆత్మీయ బంధానికి నిదర్శనం

Raksha Bandhan” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా | డిసీ ప్రతినిధి:

శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే శాశ్వతమైన ఆత్మీయ బంధానికి ఈ వేడుకలు మరోసారి నిదర్శనంగా నిలిచాయి.

ఈ పండుగను పురస్కరించుకొని, వివాహమైన మహిళా సోదరీమణులు తమ తల్లి ఇంటికి తరలివచ్చి, తమ్ముళ్లకు, అన్నలకి రాఖీ కట్టారు. “మన బంధం చిరకాలం ఇలాగే నిలవాలి” అనే ఆకాంక్షతో వారు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటి ఆంగణంలో ఆనంద సందడి నెలకొంది. సోదరులు కూడా తమ చెల్లెళ్లను, అక్కలను గౌరవించి, కానుకలు ఇచ్చి వారితో ప్రేమను పంచుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామాల్లోని పలు కుటుంబాల్లో బంధుత్వం, ప్రేమ, పరస్పర గౌరవం నిండిన దృశ్యాలు కనిపించాయి. మహిళల రాకతో పుట్టింట్లో పండుగ వాతావరణం నెలకొంది.

ఇది సాధారణ షవర్ కాదు…
ఇది *Benelave by Hindware* Ultra Thin Rain Shower

✅ 200mm స్క్వేర్ డిజైన్
✅ స్టైలిష్ మిర్రర్ లాంటి క్రోమ్ ఫినిష్
✅ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ

నీళ్ల వర్షంలో కొత్త ప్రశాంతత అనుభవించండి… ️
అమెజాన్లో కొనేందుకు https://amzn.to/4fuberLలింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *