అమెరికా సంచలన ప్రకటన: ఆ వ్యక్తి ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల రివార్డు

khameni

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల వేటలో అమెరికా మరో కీలక అడుగు వేసింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ లక్ష్యంగా అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ భారీ రివార్డును ప్రకటించింది. ఆయన ఆచూకీ తెలిపినా లేదా కీలక సమాచారం అందించినా ఏకంగా 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 92 కోట్లు) నజరానా ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించింది.

ఏమిటీ ‘రివార్డ్ ఫర్ జస్టిస్’? అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉగ్రవాద నిరోధక కార్యక్రమమే ఈ ‘రివార్డ్ ఫర్ జస్టిస్’ (RFJ). అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిన వ్యక్తులు, ఉగ్రవాద నెట్‌వర్క్‌ల సమాచారాన్ని సేకరించి, వారిని పట్టుకోవడంలో సహాయపడే వారికి ఈ ప్రోగ్రామ్ కింద మిలియన్ల కొద్దీ డాలర్లను బహుమతిగా అందజేస్తారు.

జాబితాలో మరికొంతమంది ప్రముఖులు: కేవలం మొజ్తాబా మాత్రమే కాకుండా, ఆయనకు అత్యంత సన్నిహితులైన మరికొంతమంది కీలక అధికారులపై కూడా అమెరికా కన్నేసింది:

  • అలీ అస్గర్ హెజాజీ: మొజ్తాబా కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్.

  • అలీ లారీజానీ: సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్. వీరితో పాటు మరికొందరు సీనియర్ అధికారుల సమాచారం కోసం కూడా అమెరికా వేట మొదలుపెట్టింది.

రక్షణ కూడా అమెరికాదే! సమాచారం అందించిన వారికి కేవలం రివార్డు ఇవ్వడమే కాకుండా, వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే (Relocation) బాధ్యతను కూడా తామే తీసుకుంటామని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టినా వారు తమ తదుపరి టార్గెట్ అవుతారని గతంలోనే హెచ్చరించిన అమెరికా, తాజా ప్రకటనతో ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచింది.

విచిత్రం: ఒక్క విద్యార్థి కోసం ఎగ్జామ్ సెంటర్.. తీరా చూస్తే షాకిచ్చిన అభ్యర్థి

జెఈఈ మెయిన్ సెషన్-2: దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం

కరీంనగర్ జిల్లా ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త: స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల: మార్చి 16న నోటిఫికేషన్, మే 10 వరకు దరఖాస్తు గడువు

జిల్లాలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు : క‌రీంన‌గ‌ర్, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాల‌క‌లెక్ట‌ర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *