కరీంనగర్: క్రీడల పట్ల ఆసక్తి ఉండి, ఆ రంగంలోనే స్థిరపడాలనుకునే విద్యార్థులకు భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (LNIPE), గ్వాలియర్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కరీంనగర్ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి వి. శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అందుబాటులో ఉన్న కోర్సులు:
LNIPE ఈ ఏడాది ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ సైన్సెస్‌లో కింది కోర్సులను ఆఫర్ చేస్తోంది:
-
డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ (DSC)
-
పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ (PGDSC)
-
పీజీ డిప్లొమా ఇన్ ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్ (PGDFM)
-
పీజీ డిప్లొమా ఇన్ స్ట్రెంత్ అండ్ స్పోర్ట్స్ కండిషనింగ్ (PGDS&SC)
-
బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed)
-
మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (M.P.Ed)
-
M.Sc (స్పోర్ట్స్ సైన్సెస్)
-
MA (యోగా), MA (స్పోర్ట్స్ జర్నలిజం)
-
M.S.M. (స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్)
దరఖాస్తు విధానం:
అర్హత ప్రమాణాలు, ప్రవేశ పరీక్ష వివరాలు మరియు ఇతర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.lnipe.edu.in ను సందర్శించవచ్చు.
జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.
