రీల్స్ మోజులో.. జీవితాల‌ను ప‌ణంగా పెడుతున్న యువ‌త‌

సోషల్ మీడియాలో ‘లైక్స్’, ‘ఫాలోవర్స్’ కోసం యువత చేస్తోన్న సాహసాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కొన్ని సెకన్ల వీడియో కోసం ప్రమాదకర ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా జార్ఖండ్‌లో జరిగిన ఓ ఘోర ప్రమాదం ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది.

రైల్వే ట్రాక్ వద్ద రీల్స్ సరదా
జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 19 ఏండ్ల యువ‌తి తన స్నేహితులతో కలిసి రీల్స్ రికార్డ్ చేయడానికి రైల్వే ట్రాక్ సమీపానికి వెళ్లింది. అక్కడ వీడియోలు తీస్తున్న క్రమంలో, కెమెరాపైనే దృష్టి పెట్టి వెనుక నుంచి వేగంగా వస్తున్న రైలును గమనించలేకపోయారు.

రెండు చేతులు తెగిపడి తీవ్ర గాయాలు
అనుకోకుండా రైలు అత్యంత సమీపానికి రావడంతో తొక్కిసలాట వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో సదరు బాలికను వేగంగా వచ్చిన రైలు తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బాలిక రెండు చేతులు తెగిపడ్డాయి. ప్రమాదాన్ని చూసి అక్కడున్న స్నేహితులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం మరో పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేశారు.

క్షణికానందం.. జీవితాంతం విషాదం!
సోషల్ మీడియా కంటెంట్ కోసం రైల్వే ట్రాక్‌లు, నదులు, కొండచరియల వద్ద వీడియోలు తీయడం అత్యంత ప్రమాదకరమని అధికారులు, పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కొన్ని సెకన్ల రీల్స్ కోసం చేసే చిన్న పొరపాటు జీవితాంతం కోలుకోలేని దెబ్బతీస్తుందని, తల్లిదండ్రులు కూడా పిల్లల సోషల్ మీడియా అలవాట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

టిబెట్‌లో మొదలై నేపాల్‌ను ముంచెత్తిన భీకర వరదలు: 16 మంది మృతి, 105 మంది భారతీయులు సహా 384 మంది గల్లంతు!

ఆగస్టు 20న iQOO Z11 5G గ్రాండ్ లాంచ్: రూ. 40,000 లోపే 7050mAh బ్యాటరీ, అడ్వాన్స్డ్ AI ఫీచర్లు!