టాటా ఏఐఏ ఇన్సూరెన్స్.. బాధితుడి కుటుంబానికి రూ.4.5 కోట్ల క్లెయిమ్

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో మరణించిన కరీంనగర్‌కు చెందిన పొన్నం శ్రీకాంత్ కుటుంబానికి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (Tata AIA Life Insurance) సంస్థ రూ.4.5 కోట్ల భారీ బీమా పరిహారాన్ని అందజేసింది. శ్రీకాంత్ తల్లి, నామినీ అయిన పొన్నం విజయకు సంస్థ క్లస్టర్ హెడ్ వి. వినోద్, ఇతర ప్రతినిధులు  సోమ‌వారం ఈ క్లెయిమ్ చెక్కును పంపిణీ చేశారు.

ఏడాదిలోనే క్లెయిమ్ సెటిల్మెంట్

కరీంనగర్‌కు చెందిన పొన్నం శ్రీకాంత్ నవంబర్ 2024లో ఏటా రూ.70 వేల ప్రీమియంతో టాటా ఏఐఏ సంస్థలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ డిసెంబర్ 2025లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. దీనిపై సంస్థ వేగంగా స్పందించి, తక్కువ సమయంలోనే క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేసి బాధిత కుటుంబానికి రూ.4.5 కోట్ల చెక్కును అందజేసి అండగా నిలిచింది.

జీవితంలో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడకుండా ఉండేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతో దోహదపడుతుందని సంస్థ క్లస్టర్ హెడ్ వినోద్ తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా రక్షణ లభించే ఇలాంటి పాలసీలు ప్రతి కుటుంబానికి అవసరమని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా బీమా రక్షణ కల్పించుకోవాలని ఆయన సూచించారు.

ఉచిత కన్సల్టేషన్.. ఉన్న ఊరిలోనే ఉపాధి అవకాశాలు

ఈ సందర్భంగా టాటా ఏఐఏ సీనియర్ బిజినెస్ అసోసియేట్ లీడర్ మల్లారపు పుష్ప మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ రక్షణ అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో కుటుంబాన్ని ఆదుకునేలా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలని, సరైన పాలసీల ఎంపిక కోసం 9491679493 నెంబర్ ద్వారా ఉచితంగా సంప్రదించవచ్చని తెలిపారు.

బీమాపై సరైన అవగాహన కల్పించడంతో పాటు, ఉన్న ఊరిలోనే ఉపాధి పొందేందుకు దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టి కొత్త ఇన్సూరెన్స్ అడ్వైజర్లకు అవకాశం కల్పిస్తున్నట్లు పుష్ప వివరించారు. ప్రస్తుతం బిజినెస్ అసోసియేట్ ఏజెన్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ కూడా జరుగుతోందని, ఆసక్తి గలవారు కింద ఇచ్చిన అధికారిక ఆన్‌లైన్ లింక్ ద్వారా సంప్రదించాలని కోరారు.

 కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు 

ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారురాలు పొన్నం విజయతో పాటు టాటా ఏఐఏ మేనేజింగ్ పార్ట్‌నర్ కే. నరేందర్ రావు, బ్రాంచ్ మేనేజర్లు కే. వీరస్వామి, కే. ఆదర్శ్, బీఏఎంలు బి. చంద్రశేఖర్, వి. శ్రీకాంత్, ఆర్. నవీన్, ఆర్. విజయ్, సీనియర్ బ్రాంచ్ ఆపరేషన్స్ జే. మహేందర్, ట్రైనర్ డి. వెంకటేష్ వర్మ,   మరియు సంస్థ ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.