చంద్రబాబు అరెస్ట్ తరువాత ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతోంది. టీడీపీ సోమవారం ఏపీ బంద్ కు పిలుపుకూడా ఇచ్చింది. అసలు చంద్రబాబు ఎందుకు అరెస్ట్ అయ్యాడు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు అంటే ఏమిటీ..? అన్నది ఈ వార్తలో తెలుసుకుందాం. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యువతకు స్కిల్స్ (నైపుణ్యం)లో శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్ డిజైన్‌టెక్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు రూ. 3300 కోట్లతో ప్రణాళిక రెడి చేశారు. ఇందులో భాగంగా ఏపీ గవర్నమెంట్ 10 శాతం నిధులు చెల్లించాలి. జీఎస్టీతో కలిపి 370 కోట్లు చెల్లించింది. దీంట్లో 240 కోట్లు సీమెన్స్ సంస్థకు కాకుండా వేరే కంపెనీ ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు ఆదేశాలతోనే ఈనిధులు రీలీజ్ అయినట్టు ఆరోపణలు. కంపెనీలకు డబ్బులు విడుదల అయినా యువత ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అభియోగం ఉంది. ఈ నిధులు విదేశాలకు వెళ్లి దాదాపు 70 షెల్ కంపెనీల ద్వారా తిరిగి ఇండియాకు చేరాయని ఆరోపణలు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ ముఖ్య మంత్రిపై స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కింద నాన్ బెయిల్ కేసు నమోదు చేశారు. నారా చంద్రబాబుపై 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 మరియు 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు రిజిస్టర్ చేశారు.
చదవండి ఇవి కూడా