పిచ్చోడు లండన్‌కు..మంచోడు జైలుకు

పిచ్చోడు లండ‌న్‌కు.. మంచోడు జైలుకు ఇదిక‌దా రాజారెడ్డి రాజ్యాంగం అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ట్టిట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదని.. ఎందుకు అరెస్టో తెలియదని.. ఇదే రాజారెడ్డి రాజ్యాంగమని.. నారా లోకేష్ పేర్కొన్నారు. ‘పిచ్చోడు లండన్‌ కి… మంచోడు జైలుకి… ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదు.. ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో తెలియదు.. మిగిలేది కేవలం లండన్‌ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్‌’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.మరోవైపు పొదలాడ యువగళం క్యాంప్‌ సైట్‌ వద్ద నారా లోకేష్‌ను రాజోలు సీఐ గోవిందరాజు అడ్డుకున్నారు. సీఐతో లోకేష్‌ వాగ్వాదానికి దిగారు. ఏ విధమైన నోటీస్‌ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని చూసేందుకు వెళ్ళే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. దీంతో నేలపై బౌఠాయించి లోకేష్‌ నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే పొదలాడ యువగళం క్యాంప్‌ సైట్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు హైడ్రామా చేస్తున్నారు. అదేమని అడిగితే డీఎస్పీ వస్తున్నారని చెబుతున్నారు. లోకేష్‌ వద్దకు కనీసం విూడియాను సైతం రాకుండా అడ్డుకుంటున్నారు. వస్తే అరెస్టు చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తన తండ్రిని చూడడానికి తాను వెళ్ళకూడదా అని పోలీసులను లోకేష్‌ నిలదీస్తే.. సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. తన వెంట నాయకులు ఎవరు రావడం లేదని… కుటుంబ సభ్యుడిగా తాను ఒక్కడినే వెళ్తున్నానని.. అడ్డుకునే హక్కు విూకు ఎవరు ఇచ్చారని లోకేష్‌ ప్రశ్నించారు. తన తండ్రిని చూసేందుకు వెళతానని ఆయన గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ, ఆయనను పోలీసులు తీవ్రంగా నిరోధిస్తున్నారు. యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ రాజోలులో రోడ్డుపై బైఠాయించారు.

 

 

https://twitter.com/naralokesh/status/1700324998341341405?s=20

 

ఇవి కూడా చ‌ద‌వండి

భారీతుపాన్‌.. మృతి 41 మృతి 50 మంది గ‌ల్లంతు

మొరాకోలో భూకంపం 632 మంది మృత్యువాత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *