డివైడర్‌ పైకి దూసుకెళ్లిన మినీ బస్సు : ఏడుగురు మహిళలు  మ్రుతి

తిరుపత్తూరు: ఓ వాహనం ఆగిఉన్న మినీ బస్సును ఢకొీట్టడం ఆ మినీ బస్సు రోడ్‌ డివైడర్‌ పైన కూర్చున్న వారిపైకి వెళ్లడంతో ఏడుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపాన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం తిరుపత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా..? లేక ఎవరైనా కావాలనే చేశారా..? అనే యాంగిల్‌ లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *