కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో సెలవులు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ రెండు రోజుల పాటు విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించవచ్చని పేర్కొన్నారు. యూనివర్సిటీల ఎగ్జామ్స్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని, పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. కేరళలో నిఫా వైరస్ కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది. 24 ఏండ్ల హెల్త్ వర్కర్‌కు నిఫా సోకినట్లు బుధవారం నిర్ధారణ అయింది. కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలోని 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ప్రస్తుతం వెలుగు చూసిన నిఫా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించగలదని తెలిపింది. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు అధికమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు.
చదవండి ఇవి కూడా
భర్తను చంపి.. తప్పించుకోబోయి..
ఆమె ప్రాణాలకు విలువ లేదు… ఒక చెక్ రాయండి..
విమానంలో పాడుపని… ట్విట్టర్‌లో వీడియో వైరల్
మా వార్తలు మీకు నచ్చినట్టయితే పక్కనున్న గంట గుర్తు నొక్కడి.. నోటిఫికేషన్ అలో అనండి