యూపీ సీఎం యోగి హెచ్చరిక
విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మృతికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో ఈ సంఘటన జరిగింది. వారాహి గ్రామానికి చెందిన 17 ఏండ్ల నైన్సీ పటేల్, హీరాపూర్ బజార్‌లోని ఒక కాలేజీలో ఇంటర్ చదువుతున్నది. శుక్రవారం కాలేజీ ముగిసిన తర్వాత ఆ విద్యార్థిని సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నది. కొందరు ఆకతాయిలు రెండు బైకులపై ఆ యువతిని వెంబడించి వేధించారు. ఒక బైక్ వెనుక కూర్చొన యువకుడు నైన్సీ చున్నీ లాగాడు. దీంతో ఆమె సైకిల్ అదుపుతప్పింది. వెనుక వస్తున్న మరో బైక్‌తోపాటు ఎదురుగా వచ్చిన బైక్ ఆమె సైకిల్‌నుఢికొట్టింది. ఈ నేపథ్యంలో రోడ్డుపై పడిన ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువతి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, మరణించిన విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. షాబాజ్, అతడి సోదరుడు అర్బాజ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. మరో నిందితుడు మహ్మద్ ఫైసల్ కూడా కాలి గాయంతో పోలీసులకు లొంగిపోయాడు. 20 ఏళ్ల వయసున్న ముగ్గురు నిందితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు విద్యార్థిని మృతికి సంబంధించిన వీడియో క్లిప్‌తోపాటు పోలీస్ కాల్పుల్లో గాయపడిన నిందితుల వీడియో క్లిప్స్ కూడా సోషల్ విూడియాలో వైరల్ అయ్యాయి.
మహిళలను వేదిస్తే యముడు మీ వెంటే అని యూపి సీఎం యోగి హెచ్చరించారు. గోరఖ్‌పూర్‌లో పలు అభివృద్ధిపనుల్లో పాల్గొన్న యోగి ఈ విధంగా కామెంట్ చేశాడు. చున్నీ లాగి విద్యార్థిని మృతికి కారణమైన నేఫథ్యంలో పై విధంగా స్పందించారు .
చదవండి ఇవి కూడా
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి
దుష్ట శక్తులు ఆవహించాయి.. వాస్తుదోషముందంటూ ఐదేండ్లుగా లైంగికదాడి