అప్పుడప్పడు కొంత మంది ఖాతాలో పొరపాటున డబ్బులు జమ అవుతుంటాయి.. అది వేలల్లోనో లక్షల్లోనో ఉంటంది. కానీ ఓ కారుడ్రైవర్ బ్యాంకు ఖాతాలో ఏకంగా 9 వేల కోట్లు జమ అయ్యాయి. అవును అక్షరాల ఇది నిజమే. ఈ ఊహించని ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజ్‌కుమార్ అనే వ్యక్తి చెన్నై నగరంలోని కోడంబాక్కంలో ఉంటూ కిరాయికి కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నడు. అనుకోకుండా ఈ నెల 9 తారీఖున రాజ్‌కుమార్ ఫోన్‌కు ఓ సమాచారం వచ్చింది. దానిని ఓపెన్ చేసి చూడగానే
ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. తన బ్యాంకు అకౌంట్లో అక్షరాల 9 వేల కోట్ల రూపాయలు జమ అయినట్టు ఉంది. ముందు నమ్మలేదు. తర్వాత తేరుకుని అతడి మిత్రుడికి రూ. 21 వేలు పంపాడు. అందులో నుంచి అమౌంట్ కట్ అయ్యింది. దీంతో అమౌంట్ జమ అయ్యిందని నిర్ధారణ వచ్చాడు. సంబరంలో మునిగి తేలాడు. కానీ ఆ ఆనందం కొద్దిసేపే ఉంది. తప్పును గుర్తించిన బ్యాంకు అధికారులు తిరిగి డెబిట్ చేసుకుంది. ఆ 21 వేల రూపాయలు కూడా చెల్లించాలని నోటీస్ పంపింది.
చదవండి ఇవి కూడా
గ్రహంతర వాసులు భూమిదికొచ్చారా..? ఆ అస్థిపంజారాలు ఏం చెబుతున్నాయి
ప్లంబర్‌గా వెళ్లి.. ఉగ్రవాదిగా మారి.. రెండు దేశాల మధ్య చిచ్చుకు కారణమైన నిజ్జర్
నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి.. 50.గొర్రెల అపహరణ..