మేజర్ అయిన యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామిని పెండ్లి చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అటువంటి పెండ్లిళ్లకు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పకూడదని తెలిపింది. ఇష్టపూర్వకంగా వ్యక్తిని ప్రేమించి మ్యారేజ్ చేసుకున్న తరువాత వారిని విడదీసే హక్కు కుటుంబాలకు లేదని వివరించింది. ఇటీవల ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ నవ జంటకు తమ కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు రావడంతో వారు ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారు. వారి పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు ఆ నవ దంపతులకు పోలీస్ రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ తుషారావు మాట్లాడారు. పౌరులకు భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని చెప్పారు. వారిద్దరు మేజర్లు కాబట్టి వారు చేసుకున్న మ్యారేజ్ చట్టబద్దమైందేనన్నారు. కాగా కోర్టునశ్రయించిన కొత్త జంట గత ఏప్రీల్‌లో పెండ్లి చేసుకున్నారు. ఇటీవల వారి ఫ్యామిలీ నుంచి బెదిరింపులు ఎక్కువ కావడంతో కోర్టు కెళ్లారు.
గోరంట్ల నుంచి కర్ణాటక వెళ్తుండగా రోడ్డు ప్రమాదం 12 మంది దుర్మరణం
వాషింగ్ మిషన్‌లో కరెన్సీ నోట్లు తరలింపు.. ఆర్మూర్‌లో 302 రైస్ కుక్కర్లు పట్టుకున్న అధికారులు