తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుకున్నాయి. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు నేడు (నవంబర్ 3) నుంచి నవంబర్ 10 వరకు అవకాశం ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్ స్వీకరిస్తారు. నవంబర్ 5న ఆదివారం కావడంతో ఆ రోజు నామినేషన్లు స్వీకరించరు. నవంబర్ 13 న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల విత్‌డ్రా నవంబర్ 15 న ఉంది. నామినేషన్ సెంటర్లకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. నామినేషన్ వేసే అభ్యర్థి ఐదుగురితో మాత్రమే నామినేషన్ కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. నవంబర్ 30న పొలింగ్, డిసెంబర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. నామినేషన్ దాఖలు చేయడానికి జనరల్, బీసీ అభ్యర్థులకు 10 వేల రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఓట్లు తెచ్చుకుంటే డిపాజిట్ తిరిగి ఇస్తారు.
ఇవి కూడా చదవండి
బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..
నాభర్తను చంపేయి.. సింగరేణి ఉద్యోగం చేసుకుందాం
పొలంలో కరెంట్ తీగ.. లాగితే భార్య డొంక కదిలింది