Saturday , 27 July 2024
Breaking News

నాభ‌ర్త‌ను చంపేయి.. సింగ‌రేణి ఉద్యోగం చేసుకుందాం

వివాహేత‌ర సంబంధాలు ప‌చ్చ‌ని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఏచోటా వివాహేతర సంబంధాల‌తో క‌ట్టుకున్న‌వారిని హ‌త‌మార్చిన ఘ‌ట‌న‌ల‌ను చూస్తూనే ఉన్నాం. తాజాగా పెద్ద‌ప‌ల్లి జిల్లాలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. రామ‌గుండంలోని పోత‌న కాల‌నీకి చెందిన లావుడ్యా ర‌మ మ‌ధుకర్ దంపతులు. మ‌ధుక‌ర్ సింగ‌రేణి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. హాయిగా సాగిపోతున్న జీవితం. కానీ వివాహేత‌ర సంబంధం వీరి అన్యోన్య జీవితాన్ని చిన్నా భిన్నం చేసింది. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌ల్హ‌ర్‌రావు మండ‌లం నాచారం మ‌ల్ల‌య్య‌ప‌ల్లికి చెందిన ధ‌రావ‌త్ గోవ‌ర్ధ‌న్ తో ఓ పెండ్లి సంబంధం గురించి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యంతో గోవ‌ర్ధ‌న్, ర‌మ ఇద్ద‌రూ త‌ర‌చూ ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లు. దీంతోపాటు గోవ‌ర్ధ‌న్ ర‌మ ఇంటికి వ‌చ్చి రెండు మూడు రోజులు ఉండిపోయేవాడు. ఈక్ర‌మంలో వీరి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఈ వ్య‌వ‌హారంపై ర‌మ భ‌ర్త‌మ‌ధుక‌ర్‌కు అనుమానం వ‌చ్చింది. ర‌మ త‌న భ‌ర్త మ‌ధుక‌ర్ ను అడ్డుతొల‌గించుకుంటే సింగరేణి ఉద్యోగం సుకోవ‌చ్చు, ఇద్ద‌రం క‌లిసి జీవిచొచ్చు అని గోవ‌ర్ధ‌న్‌కు సూచించింది. దీంతో గోవ‌ర్ధ‌న్ అంగీక‌రించి త‌న మిత్రులైన జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా కొత్త‌ప‌ల్లికి చెందిన కోట ల‌క్ష్మ‌ణ‌స్వామి, ఖాసింప‌ల్లికి చెందిన క‌ర్నెనాగరాజుల సాయంతో అక్టోబ‌ర్ 29 న రాత్రి ఏడు గంట‌ల‌కు మందుతాగుదామ‌ని పిలిచారు. అత‌ని బైక్ మీద‌నే గోదావ‌రిఖ‌నిలోని ఓ వైన్స్ షాప్‌లో మద్యం తీసుకున్నారు. అనంత‌రం మ‌ల్యాల‌ప‌ల్లిలోని రాజీవ్ ర‌హ‌దారి ప‌క్క‌న మ‌ద్యం తాగారు. మ‌త్తులో ఉన్న మ‌ధుక‌ర్ త‌ల‌పై ఈ ముగ్గురు క‌లిసి ఇనుప రాడ్డుతో క‌ట్టి చంపేశారు. అక్క‌డే ప‌క్క‌నే ఉన్న‌కాల్వ‌లో ప‌డేసి ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని కూడా కెనాల్‌లోకి ప‌డేశారు. అనంత‌రం రోడ్డు ప్ర‌మాదంగా చిత్రీక‌రించారు. ఈ విష‌యాన్ని ర‌మ‌కు చెప్పి గోవ‌ర్ద‌న్ అక్క‌డినుంచి పారిపోయాడు. మృతుడి శ‌రీరంపై ఉన్న గాయాల‌ను చూసిన మ‌ధుక‌ర్ కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో పోలీసులు ర‌మ‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా హ‌త్య విష‌యం తెలిసిన‌ట్టు గోదావ‌రి ఖ‌ని ఏసీపీ తులా శ్రీ‌నివాస్‌రావు చెప్పారు. నిందితుల‌ను కోర్టులో హాజ‌రుప‌రిచిన‌ట్టు చెప్పారు.

భార్య‌ను చంపి.. రోడ్డు ప్ర‌మాదంగా న‌మ్మించి.. ప్రియురాలి భ‌ర్త‌ను చంపి.. సినిమాను త‌ల‌పించే స్టోరీ

కొడిగుడ్ల కూర వండ‌లేద‌ని భార్య‌ను చంపిన భ‌ర్త

ట్రాక్ట‌ర్తో స్టంట్స్ చేయ‌బోతే… ప్రాణాలే పోయాయి..

About Dc Telugu

Check Also

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Flood rescue Drone” సాధార‌ణంగా వ‌ర్ష‌కాలం వ‌ర‌ద‌లు రావ‌డం స‌హ‌జం. భారీ వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు లోత‌ట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …

Delhi News

Delhi News” దేశ రాజ‌ధానిలో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు.. ఎంత‌కు తెగించారంటే.. వీడియో

Delhi News” కొన్ని దారుణ ఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటాయి.. దొంగ‌త‌నాలు, దాడులు ఎక్కువ‌గా రాత్రే జ‌ర‌గుతుంటాయి. అవి కూడా …

Mumbai Local Train

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

Mumbai Local Train” గ‌మ్య స్థానం చేరుకునేందుకు ర‌ద్దీగా ఉన్నలోక‌ల్ రైళ్లో   వెళ్తున్న ఓ వ్య‌క్తి కింద‌ప‌డిన భ‌యాక‌న‌ ఘ‌ట‌న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com