స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి జ్యడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. చంద్రబాబు పలు అనారోగ్య కారణాలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఆయన కు ఇష్టమైన దవాఖానాలో చికిత్స చేయించుకోవచ్చని ఏపీ హైకోర్టు పేర్కొంది. అయితే కొన్ని షరత్తులను విధించింది. ఇలు, హాస్పిటల్‌కు మాత్రమే పరిమితం కావాలని ఖండిషన్ పెట్టింది. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని సూచించింది. ఈ కేసులోని సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది కోర్టు. చంద్రబాబు నాయుడు ఎటువంటి చికిత్స తీసుకున్నారో తమకు నివేదిక ఇవ్వాలని తెలిపంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ అదుపులోకి తీసుకుంది. హైకోర్టు ఆదేశాలను రాజమండ్రి జైలు అధికారులకు చంద్రబాబు తరుపున లాయర్లు అందించిన తరువాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
ఇవి కూడా చదవండి
స్కూల్ వ్యాన్, కాలేజీ బస్సు ఢీ నలుగురు విద్యార్థులు మృతి 16 మందికి గాయాలు