ప‌నిలోంచి తీసేసిందని.. ప‌గ పెంచుకుని చంపేశాడు.

క‌ర్ణాట‌క‌లో సంచ‌ల‌నంగా మారిన మ‌హిళా అధికారిణి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వీడింది. క‌ర్నాట‌క మైన్స్ అండ్ జియాల‌జీ శాఖ‌లో డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న అధికారిణి ప్ర‌తిమ శ‌నివారం హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీస్‌లు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. సోమ‌వారం కిర‌ణ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కిర‌ణ్ క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌మెంట్‌లో కాంట్రాక్ట్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న బాగోలేక‌పోవ‌డంతో అత‌డిని స‌ర్వీస్ నుంచి తొలగించారు. ఈ కార‌ణంగానే ఆమెను హ‌త్య చేసి ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఆమె భ‌ర్త‌, కొడుకు వాళ్ల సొంతూరు వెళ్ల‌డంతో శ‌నివారం ప్ర‌తిమ ఒంట‌రిగా ఉంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన దుండ‌గుడు క‌త్తితో దాడి చేసి చంపేశాడు.

ఉన్న‌తాధికారిణి దారుణ హ‌త్య‌

హృద‌యాల‌ను గెలిచావ్ పోలీస్ వీడియో వైర‌ల్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *