కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. మొత్తంగా 119 సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా జోరందుకోనుంది. మొత్తంగా మూడు దశల్లో అభ్యర్థులను ప్రకటించారు. అసంతృప్తులు ఎదురవుతున్నా గట్టిపోటినిచ్చి గెలిచేవారికే టిక్కెట్ ఇచ్చినట్టు కనబడుతోంది. ఇక సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కామారెడ్డిలో కాంగ్రెస్ తరుపున షబ్బీర్ అలీని బరిలో నిలుపుతారని ప్రచారం సాగింది. ఆతరువాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటూ వినబడింది. అనుకుంటుగానే రేవంత్‌రెడ్డికే టిక్కెట్ కేటాయించారు. రేవంత్‌రెడ్డి కొడంగల్, కామారెడ్డి రెండు చోట్లా పోటీ చేయనున్నారు.
చెన్నూరు – జి. వివేక్
బోథ్ – ఆడే గజేందర్
జుక్కల్ – తోట లక్ష్మీ కాంతారావు
బాన్సువాడ- ఏనుగు రవీందర్‌రెడ్డి
కామారెడ్డి – రేవంత్ రెడ్డి
నిజామాబాద్ – అర్బన్ షబ్బీర్ అలీ
కరీంనగర్ – పురుమాల్ల శ్రీనివాస్
సిరిసిల్ల – కేకే మహేందర్‌రెడ్డి
నారాయణఖేడ్ – సురేష్ కుమార్ షట్కర్
పటాన్ చెరు – నీలం మధు ముదిరాజ్
వనపర్తి – తూడి మెగారెడ్డి
డోర్నకల్ – జాటోత్ రామచంద్రు నాయక్
ఇల్లందు – కోరం కనుకయ్య
వైరా – రామ్దాస్ మాలోతు
సత్తుపల్లి – డా మట్టా రాగమయి
ఆశ్వారావుపేట – జారే ఆదినారాయణ
ఇంతకు ముందు ప్రకటించి ఇప్పుడు మార్చిన స్థానాలు
వనపర్తి ఇంతకుముందు చిన్నారెడ్డి పేరు ప్రకటించారు. ఇప్పుడు తూడి మెగారెడ్డి, బోథ్ ఇంతకు ముందు వన్నెల అశోక్ ను ప్రకటించగా , ఇప్పుడు ఆడే గజేందర్ ను పోటీలో దించారు.
పనిలోంచి తీసేసిందని.. పగ పెంచుకుని చంపేశాడు.
హృదయాలను గెలిచావ్ పోలీస్ వీడియో వైరల్
ఎంఐఎం అభ్యర్థులు వీరే.. కొత్తగా రెండు స్థానాల్లో పోటీ, పాతోళ్లు ఇద్దరు పోటికి దూరం
బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..