తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్యం, ఫ్యాక్టరీలు, సంస్థల చట్టం – 1974, తెలంగాణ షాప్ కాంప్లెక్స్ చట్టం -1988 రూల్స్ ప్రకారం.. రాష్ట్రంలో కార్మికులందరికీ సెలవు ప్రకటించింది. ఈమేరకు కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఐ. రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకునేందుకు ఈ సెలవును ప్రకటించినట్టు తెలుస్తోంది.
ఇవికూడా చదవండి
లోయలో పడ్డ బస్సు 36 మంది మృతి
రెండు రోజులు పాఠశాలలకు సెలవు