గంగాధర: సమాజంలో ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మా ఊరి మహాలక్ష్మి వ్యవస్థాపక అధ్యక్షులు రేండ్ల శ్రీనివాస్ అన్నారు. సమాజంలో ఆడపిల్లల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊరి మహాలక్ష్మి పౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండాయపల్లిలో 2022లో జన్మించిన 10 ఆడపిల్లలకు ఆదివారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మా ఊరి మహాలక్ష్మి వ్యవస్థాపక అధ్యక్షులు కొండాయపల్లి గ్రామానికి చెందిన రేండ్ల శ్రీనివాస్ మాట్లాడారు. తమ గ్రామంలోని మహిళందరూ రోజుకో రూపాయి పొదుపు చేయాలని సూచించారు. ఇలా పొదుపు చేసిన డబ్బును ప్రతి సంవత్సరం తమ గ్రామంలో జన్మించే ఆడపిల్లలకు చేయొచ్చని సూచించారు. తాను గల్ప్‌లో ఉద్యోగం చేస్తానని, గల్ప్‌లో తన వాహనాన్ని పెయిడ్ పార్కింగ్ చేయకుండా, ఫ్రీ పార్కింగ్‌లో చేసి తద్వారా పొదుపుచేసిన డబ్బును మాఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం తమ గ్రామంలో జన్మించే ఆడ పిల్లలకు అందజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించామని, ఆరు సంవత్సరాలుగా ఏ ఆటంకంలేకుండా కొనసాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మొత్త పది ఆడపాపలకు ఒక్కో పాప పేరిట 5000/- మరియు తల్లిదండ్రుల సహకారంతో 5,000/- మొత్తం 10,000/- సుకన్య సమృద్ది యోజనలో ఫిక్స్ డిపాజిట్ చేసి తల్లిదండ్రులకు ఫౌండేషన్ అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యవర్గం సభ్యుల చేతుల మీదుగా పాస్ బుక్కులు అందజేశారు. ట్రస్ట్ ఫౌండర్ రేండ్ల పద్మ శ్రీనివాస్ లు 50వేల ఆర్థిక సహకారంతో సుకన్య సమద్ధిలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో రేండ్ల పద్మ, సునిల్, మధు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జనం ఏరీ…? రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్నా వద్దా..? ముందు ఎమ్మెల్యేగా గెలిపించండి
జనం ఏరీ…? రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్నా వద్దా..? ముందు ఎమ్మెల్యేగా గెలిపించండి