జొన్న రొట్టెల కోసం వ‌చ్చి… ప్రియురాలి భ‌ర్త‌ హ‌త్య

వివాహేత‌ర సంబంధాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. త‌మకు అడ్డుగా ఉన్నాడ‌ని భ‌ర్త‌ను ప్రియుడితో చంపిన ఘ‌ట‌న చౌటుప్ప‌ల్‌లో చోటు చేసుకుంది. చౌటుప్ప‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లోఏర్పాటు చేసిన స‌మావేశంలో  ఏసీపీ మొగుల‌య్య వివ‌రాలు వెల్ల‌డించారు. ర‌మావ‌త్ వెంక‌టేశ్వ‌ర్లు, అలియాస్ శ్రీ‌నుది న‌ల్ల‌గొండ జిల్లాలోని చింత‌ప‌ల్లి మండ‌లం కొక్కిరాల తండా. కాగా త‌న భార్య స‌రోజ‌తో క‌లిసి ఉపాధి కోసం చౌటుప్ప‌ల్‌లో ఉంటున్నాడు. అక్క‌డే ఓ వాట‌ర్ ప్లాంట్ ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. త‌న భార్య స‌రోజ అక్క‌డే జొన్న రొట్టెలు విక్ర‌యిస్తోంది. ఈ క్ర‌మంలో చౌటుప్ప‌ల్‌లోని ఓ కోళ్ల ఫామ్‌లో ప‌నిచేసే మాతంగి మ‌హేశ్ అనే వ్య‌క్తి స‌రోజ వ‌ద్ద త‌ర‌చూ జొన్న రొట్టెలు తీసుకెళ్లాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. దీంతో వారి ఇద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. కొన్నాళ్ల త‌రువాత ఈ విష‌యం స‌రోజ భ‌ర్త వెంక‌టేశ్వ‌ర్ల‌కు తెలియ‌డంతో గొడ‌వ‌లు జ‌రిగాయి. ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని ఇద్ద‌రినీ హెచ్చ‌రించాడు. దీంతో అడ్డులేకుండా ఉండేందుకు వెంక‌టేశ్వ‌ర్ల‌ను చంపాల‌ని ఇద్ద‌రు నిర్ణ‌యించుకున్నారు. డిసెంబ‌ర్ 2 తారీఖు రోజున ఇంట్లోనే స‌రోజ‌, మ‌హేశ్‌లు క‌లిసి వెంక‌టేశ్వ‌ర్ గొంతుకు తాడు బిగించి హ‌త్య చేశారు. అనంత‌రం మృత‌దేహాన్ని ప‌క్కనే ఉన్న బిల్డింగ్ పై ప‌డేసి మ‌హేశ్ ప‌రార‌య్యాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. స‌రోజపై అనుమానం ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించ‌గా మ‌హేశ్‌తో క‌లిసి హ‌త్య చేసిన‌ట్టు తేలింది. దీంతో ఇద్ద‌రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

 

క‌’న్నీట’ చెన్నై .. హృద‌య‌విదార‌క వీడియోలు

పాగాల సంపత్‌కు కెటిఆర్‌ నివాళి : అండ‌గా ఉంటామ‌ని హామీ

నెక్స్ట్ ఐటీ మినిస్ట‌ర్ ఎవ‌రు.. ? కేటీఆర్ పై ట్విట్ట‌ర్‌లో చ‌ర్చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *