ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా: కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికీ వర్తింపు!

cm revanth reddy

 రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులే అత్యంత కీలకమైన భాగస్వాములని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా గురువారం సాయంత్రం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఉద్యోగుల పాలిట చారిత్రాత్మకమైన భారీ ప్రమాద బీమా పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సుమారు 15 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భరోసా చేకూరుతుందని సీఎం వివరించారు.

📌 బీమా పథకం ముఖ్యాంశాలు:

  • అందరికీ వర్తింపు: కేవలం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో ఉన్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు పెన్షనర్లకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.

  • భారీ బీమా సొమ్ము: ప్రమాద వశాత్తూ మరణిస్తే రూ. 1 కోటి నుంచి రూ. కోటిన్నర వరకు ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది అని చెప్పారు.

  • విమాన ప్రమాదాలకు ప్రత్యేక ప్యాకేజీ: ఒకవేళ విమాన ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే రూ. 3 కోట్ల వరకు బీమా వర్తించేలా బ్యాంకులతో చారిత్రాత్మక ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు.

  • సింగరేణిలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్: తొలుత ఈ ఉచిత బీమా విధానాన్ని సింగరేణిలో ప్రయోగాత్మకంగా అమలు చేసి, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన 45 మంది కార్మికుల కుటుంబాలకు ఇప్పటికే కోటిన్నర చొప్పున బీమా సొమ్మును అందించినట్లు సీఎం గుర్తుచేశారు. ఈ పథకం వెనుక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అపారమైన కృషి ఉందన్నారు.

💬 “నేను దొరను కాదు.. మీ రేవంతన్నను”

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు:

“నేను ఏనాడూ దొరలా భావించుకోలేదు. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రజల మధ్య పెరిగి వచ్చిన వాడిని కాబట్టే ఉద్యోగుల కష్టాలు, అవసరాలు నాకు బాగా తెలుసు. పదవులు మారినా ప్రజలతో నాకున్న అనుబంధం ఎప్పటికీ మారదు. అందరూ నన్ను ‘రేవంతన్న’ అని పిలుచుకోవడమే నాకు ఇష్టం.”  అని అన్నారు.

📅 ఒకటో తారీఖునే జీతాలు!

గత ప్రభుత్వ హయాంలో నెలలో 10వ తేదీ వచ్చినా జీతాలు దొరకని దారుణ పరిస్థితులు ఉండేవని, కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి 1వ తేదీ నుంచి ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేస్తున్నామని ఆయన సగర్వంగా ప్రకటించారు.

this also read

ప్రేమ పేరిట పైశాచికత్వం.. కేతన్ అగర్వాల్ మరణం వెనుక నమ్మలేని నిజాలు