సీఎం రేవంత్‌రెడ్డి హామీలు ఆచరణ సాధ్యం కానివి ఇచ్చారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. బుధవారం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిందన్న బాధను తట్టుకోలేక ఎకసక్కెపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి ఏం వెలగబెట్టారో ప్రజలు చూస్తున్నారని విమర్శించారు. ఇప్పుడే బీఆర్ ఎస్ నాయకులకు అంతతొందరొద్దని సూచించారు. తమ హామీలకు బీఆర్ ఎస్ నాయకులు పెంచి ఇస్తామని చెప్పారు కదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి హామీని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రజలు సంతోషపడుతున్నారని మంత్రి సీతక్క తెలిపారు.
ఇవి కూడా చదవండి
రేవంత్‌ను వదిలిపెట్టబోం.. హామీలు ఎలా అమలు చేస్తారో మేమూ చూస్తాం కేటీఆర్