ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండీగా ముర్తుజా
హెచ్‌ఎండిఎ కమిషనర్‌గా ఆమ్రపాలీ
వైద్యారోగ్యశాఖ కార్యదర్శిగా శైలజారామయ్యర్
డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్
తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారు.. ఇప్పటివరకు ఉన్న అధికారులకు స్థాన చలనం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే.. ఇన్ని రోజులు సరైన గుర్తింపు లభించిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పజెప్తోంది. ఇప్పటికే.. రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్‌లకు స్థాన చలనం కల్పించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు పలువురు ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ రేవంత్ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన విద్యుత్ శాఖలోనూ కీలక మార్పులు చేసింది. ట్రాన్స్‌కో జన్కో సీఎండీగా ఉన్న ప్రభాకర్ రావు రాజీనామా చేయటంతో.. ఆ స్థానంలో సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నిమామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. కేంద్రం సర్వీసుల నుంచి తిరిగి తెలంగాణకు వచ్చిన ఆమ్రాపాలి కాటాకు రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి, మూసీ అభివృద్ధి సంస్థ ఇంచార్జి ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బీ. గోపి నియామకం అయ్యారు. ఇంధన శాఖ కార్యదర్శిగా రిజ్వి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రాన్స్‌కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ ఝా, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కం సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి నియామకం అయ్యారు. వరంగల్ జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా సేవలందించిన ఆమ్రాపాలి.. డిప్యూటేషన్ విూద కేంద్రానికి వెళ్లారు. 2020 నుంచి పీఎంఓ ఆఫీసులో డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అయితే.. ఆమె సేవలు 2026 వరకు ఉండగా.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి సర్కార్ ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే.. సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా స్మితా సబర్వాల్ వ్యవహరించగా.. ఆమె స్థానంలో ఆమ్రాపాలి నియమించనున్నారన్న ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి
మా అంజిగాడిని పరిచయం చేస్తున్నాం
రేవంత్‌ను వదిలిపెట్టబోం.. హామీలు ఎలా అమలు చేస్తారో మేమూ చూస్తాం కేటీఆర్