తెలంగాణాలోనే ఉంటా.. స్మితా స‌బ‌ర్వాల్ స్ప‌ష్టం

తెలంగాణాలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన తరువాత చాలా మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కేంద్ర స‌ర్వీసులోకి వెళ్తార‌ని పుకార్లు వ‌చ్చాయి. కొత్త ముఖ్య‌మంత్రి, మంత్రుల‌ను ప‌లువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌డం లేద‌నే వార్త‌లొచ్చాయి. మ‌రీ ముఖ్యంగా సీఎంవోలో ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి విధుల‌తో పాటు నీటిపారుద‌ల శాఖ బాధ్య‌త‌లు చూస్తున్న‌ స్మితా స‌బ‌ర్వాల్ గురించి ఎక్కువ‌గా చ‌ర్చ సాగింది. స్మితా స‌బ‌ర్వాల్ డిప్యూటేష‌న్‌పై కేంద్ర స‌ర్వీసులోకి వెళ్తార‌ని ప్ర‌చారం సాగింది. దీనిపై ఆమె స్పందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా తాను తెలంగాణ స‌ర్వీస్‌లోనే కొన‌సాగుతాన‌ని చెప్పారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె ఇలా రాసుకొచ్చారు. నేను సెంట్రల్ డిప్యుటేషన్‌కి వెళ్తున్నానని కొన్ని వార్తా ఛానెల్‌లు ఫేక్ వార్త‌లు రాయడం చూశాను. అది విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇది పూర్తిగా అబద్ధం మరియు నిరాధారం. తెలంగాణ కేడర్‌కు చెందిన IAS అధికారిగా, తెలంగాణ ప్రభుత్వం నాకు అప్ప‌గించే ఏ బాధ్య‌త‌నైనా నేను కొనసాగిస్తాను, నిర్వహిస్తాన‌ని ఆమె పేర్కొన్నారు. నా రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాన‌ని రాసుకొచ్చారు. స్మిత స‌బ‌ర్వాల్ 2001 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *