మా అంజిగాడిని ప‌రిచ‌యం చేస్తున్నాం

‘నా సామిరంగ సినిమాలో టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున చాలా రోజుల త‌రువాత నటిస్తున్నారు. ఈ ఈ సినిమా పూర్తిస్థాయి మాస్‌ చిత్రం. ఇందులో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్ న‌టిస్తున్నారు. ఈ మూవితో విజయ్ బన్నీ డైరెక్ట‌ర్‌గా పరిచయం అవుతున్నాడు. పెద్ద పండుగ సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కానుంది. కాగా శ్రీ‌నివాస్ చిట్టూరి నిర్మాత‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దీనికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి మరో స్టార్‌ కాస్ట్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. అల్లరి నరేష్‌ అంజి అనే ఓ కీలక పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నార‌ని చిత్ర‌బృందం పేర్కొంది. ఈ ముచ్చ‌ట చెబుతూ మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం లేదంటే మాటోచ్చేత్తది అంటూ రాసుకోచ్చింది. ఇక అంజి గాడికి సంబంధించిన స్పెషల్‌ ఇంట్రో ప్రోమోను రేపు ఉదయం 10.18 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు ఈ సినిమా నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పాట చూస్తే.. హీరో హీరోయిన్ల మధ్య సాగే కలర్‌ ఫుల్‌ ట్రాక్‌ సినిమాకు హైలెట్‌ కానుందని విజువల్స్‌ చెబుతున్నాయి. ఈ మూవీకి ఆస్కార్స్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

 

మందెక్కువై సొలుగుతూ న‌డుస్తున్న పిల్లి.. వీడియో వైర‌ల్

తెలంగాణాలోనే ఉంటా.. స్మితా స‌బ‌ర్వాల్ స్ప‌ష్టం

 

సలార్‌, డంకీల మధ్య పోటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *