పటేల్ క్రికెట్ లీగ్ ట్రోఫీ పోటీలను ప్రారంభించిన చల్ల హరి శంకర్
కరీంనగర్ 12.. డీసీ ప్రతినిధి
క్రీడలతో స్నేహభావం క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెంపొందుతుందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ని ఎస్ అర్ ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి పటేల్ క్రికెట్ లీగ్ ట్రోఫీ పోటీలకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో సరదాగా క్రికెట్ ఆడిన అనంతరం మాట్లాడుతూ.. క్రీడలు మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదం చేస్తాయని అన్నారు. క్రీడలు దేహదారుఢ్యానికి దోహదం చేస్తాయన్నారు. అంతేకాకుండా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి, గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు . అనంతరం మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు ల్లో స్నేహభావం పెంపొందించాలని ఉద్దేశంతో ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిపోర్టులో ఇప్పటివరకు 20 జట్లు పాల్గొన్నట్లు తెలిపారు. మున్నూరు కాపు,ఉద్యోగ సంఘాలు , మెడికల్ విభాగం, యువత , యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు రసవత్తరంగా జరిగినాయి. నేడు జర్నలిస్టులు, అడ్వకేట్స్ క్రికెట్ పోటీలో ఆడనున్నట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి నేడు బహుమతులు ప్రధానం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ కోల అన్నారెడ్డి , గంగాధర జెడ్పిటిసి పుల్కం నరసయ్య,మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శి సూదుల వెంకటరమణ పటేల్, కోశాధికారి తోటరమణ పటేల్, ఉపాధ్యక్షులు సుమ పటేల్, బండి రఘు పటేల్, గంగాధర్ పటేల్ కార్యవర్గ సభ్యులు రాచమల్ల సుగుణాకర్ పటేల్, పోకలమధు పటేల్, మున్నూరు కాపు సంక్షేమ సంఘం బద్దిపల్లి జిల్లా అధ్యక్షులు రాచమల్ల కరుణాకర్ పటేల్ , పటేల్ యూత్ ఫోర్స్ టీం సభ్యులు అఖిల్, అభిషేక్, అనుదీప్ ,రామ్, నిఖిల్ ,శ్రీనివాస్
మున్నూరుకాపు యువత పాల్గొన్నారు.