holiday” ఫిబ్రవరి 8న సాధార‌ణ సెలవు

holiday

holiday” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న సాధార‌ణ‌ సెలవుగా ప్రకటించింది. ముస్లింల షబ్‌-ఎ-మెరాజ్‌ పండుగ సందర్భంగా ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ‌వ‌ర్నమెంట్ రిలీజ్ చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్‌-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించిన‌ప్ప‌టికీ ఐచ్ఛిక సెలవు కింద పేర్కొనబడింది.. కానీ దీనిని సాధారణ సెలవు దినంగా మార్చారు. ముస్లింలు షబ్‌-ఎ-మెరాజ్‌ను పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పండుగ రోజు నా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనల్లో పాల్గొంటారు. 8న సాధారణ సెలవు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవును ప్రకటించారు.
సెలవుల క్యాలెండర్‌ ప్రకారం, మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న సెలవు ఉంది. మార్చి 25 హోలీ రోజు, గుడ్‌ ఫ్రైడే సందర్భంగా మార్చి 29కి సెలవు ఇచ్చారు. ఏప్రిల్‌ 5న బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఏప్రిల్‌ 9 ఉగాది సెలవు. ఏప్రిల్‌ 11, 12 తేదీల్లో రంజాన్‌ సెలవు ప్రకటించారు.ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి, ఏప్రిల్‌ 17న శ్రీరామనవమికి కూడా సెలవు ఇచ్చారు. జూన్‌ 17 బక్రీద్‌ సెలవు. జూలై 17న మెహ్రం సెలవు. బోనాల సందర్భంగా జూలై 29న సెలవు ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం. శ్రీకృష్ట జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26న సెలవు ఇచ్చారు. సెప్టెంబర్‌ 7న వినాయక చవితి హౌలీ రోజు. సెప్టెంబర్‌ 16న ఈద్‌ నబీకి సెలవు ఇచ్చారు. అక్టోబర్‌ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సెలవు.. అక్టోబర్‌ 12, 13 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్‌ 31 దీపావళి సెలవు. గురునానక్‌ జయంతి సందర్భంగా నవంబర్‌ 15 సెలవు. డిసెంబర్‌ 25, 26 క్రిస్మస్‌ సెలవు ప్రకటించింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Anand Mahindra Tweet నేను పెట్టుబ‌డి పెడుతా.. వీటిని త‌యారు చేయ‌గ‌ల‌రా..? ఆనంద్ మ‌హింద్ర ట్వీట్

గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తూ పట్టుబ‌డ్డ పోలీసులు

elephant attacked” భూమ్మీద నూక‌లుండ‌టం అంటే ఇదే.. వెంట్రుక మందంలో ప్రాణాల‌తో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *