క్రికెట్ అంటే తెలియని వారుండరు.. భారత దేశంలో అయితే క్రికెట్‌కు వీరాభిమానులుంటరు. అంతటి ప్రాచుర్యం కలిగిన క్రికెట్‌ను భూమ్మీదే ఆడుతారని తెలుసు.. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి చూస్తే క్రికెట్ నీళ్లలో కూడా ఆడవచ్చు అని అర్థమవుతుంది. కొంత మంది యువకులు క్రికెట్ ఆడటానికి కాలువ గట్టుకు వెళ్లారు. కాలువకు రెండువైపులు వికెట్లు పెట్టారు. బ్యాటర్ అవతలి ఎండ్ బ్యాటింగ్ చేయగా బౌలర్ ఇవతలి వైపు నుంచి బాల్ విసిరాడు. బంతి నీళ్లమీద స్టెప్ తీసుకుని నేరుగా బ్యాటర్ వద్దకు వెళ్లింది. బ్యాటర్ దాన్ని ఫీల్డర్‌వైపు కొట్టాడు. ఫీల్డర్ అప్పటికే నీళ్లలో ఉన్నాడు. నీళ్లలో ఈదుతూ బంతిని అందుకున్నడు. ఇంతలో బ్యాటర్ పరుగుకోసం ఈదుతూ ముందుకు మరో ఎండ్‌కు వెళ్లడం మనం వీడియోల చూడొచ్చు. బాల్ పట్టుకున్న బౌలర్ వికెట్లవైపు విసరడం.. బ్యాటర్ అవుట్‌కావడం మనం ఈవీడియోలో చూడవచ్చు. అయితే ఇదంతా నీళ్లపై ఆడడం గమనార్హం. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
We should add this Cricket + Swimming sport in olympics calling it Swimket.
This is brilliant pic.twitter.com/a5EmJm1VPx— Godman Chikna (@Madan_Chikna) February 5, 2024
Mlc kavitha” సూర్యనిమీద ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది.. ఎమ్మెల్సీ కవిత
కాశ్మీర్ నుంచి చిన్నపిల్లల రిపోర్టింగ్.. సంబుర పడ్డ ఆనంద్ మహింద్రా..
Viral video” కొత్త డాక్టరండీ.. నొప్పిలేకుండా పన్ను తీసిన చిలుక.. వీడియో వైరల్