Mlc kavitha” రెండు రోజులుగా బీఆర్ ఎస్ కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ప్రాజెక్టులపైకి ఆంధ్రా పోలీసులు ఎలా వచ్చారంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులను ప్రశ్నించారు. ఈ క్రమంలో కొంత ఆవేశంగా కొన్ని పదాలు వాడుతూ మాట్లాడారు. దీనిపై బీఆర్ ఎస్ నాయకులు తీవ్రంగాగానే కౌంటర్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సోమవారం మంచిర్యాలలో మాజీ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని దూషించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీంతో పాటు తాజాగా బాల్కసుమన్ పై కేసునమోదైంది. దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందిం చారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని ట్వీట్ చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుందని విమర్శించారు. సూర్యుని పై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి మీ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024
ఇవి కూడా చదవండి
కాశ్మీర్ నుంచి చిన్నపిల్లల రిపోర్టింగ్.. సంబుర పడ్డ ఆనంద్ మహింద్రా..
Viral video” కొత్త డాక్టరండీ.. నొప్పిలేకుండా పన్ను తీసిన చిలుక.. వీడియో వైరల్