పంటి తీయించుకోవాలంటే పంటి డాక్టర్ దగ్గరకు వెళ్తాం. చిన్నపిల్లలకు అయితే పాల దంతాలు పోయి కొత్త వస్తుంటాయి.. ఇది సర్వసాధారణం. చిన్న పిల్లలదంతాలు వాటంతట అవే ఊడిపోతాయి.. కొన్ని సార్లు ఊడిపోకున్న ఊగుతున్నప్పుడే వాటిని పెద్దవాళ్లు మెల్లగా తొలగిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ బాలుడి పన్నును రామచిలుక సునాయాసంగా ఎటువంటి నొప్పి లేకుండా ఊడదీసింది. పిల్లవాడు నోరు తెరిచి ఉంచాడు. మరొకరు చిలకను అతని పన్ను వద్దకు తీసుకెళ్లాగానే పన్నును నోటకరిచి ఒక్కటే సెకన్‌లో తొలగించింది. పన్ను తీసిన విషయం కూడా అతడికి అర్థం కాలేదు. ఏం జరిగిందోనని ఆశ్చర్యంగా చూశాడు. తరువాత తేరుకుని చిలుకవైపు నవ్వుతు చూడడం వీడియోలో కన్పిస్తున్నది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. bebeginsayfasi అనే ఇన్‌స్టా ఐడీలో వైరల్ అవుతున్నది
View this post on Instagram
Viral video” భార్యా పిల్లలు ఎక్కకుండానే.. వీడియో వైరల్
Ts Rtc” బకాయిలు ఎగవేస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన ఆర్టీసీ