Kcr Meeting” కరీంనగర్ : రెప్పపాటు కరెంట్ పోకుండా కరెంట్ ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘనతేనని మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత (Kcr Meeting) కెసిఆర్ అన్నారు. రైతులను ఆదుకోవాలని రైతుబంధు ఇచ్చామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని, గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు అండగా ఉంటుందన్నారు. కరీంనగర్ కదనభేరిలో బీఆర్‌ఎస్ అధినేత (Kcr Meeting) కెసిఆర్ ఘాటు విమర్శలు చేశారు. గులాబీ జెండా ఎగిరితేనే కాంగ్రెస్‌పై యుద్దం చేయగలుగుతామని అన్నారు. లేకుంటే వారి గ్యారెంటీలను పట్టించుకోరని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీల్ళెందుకు మాయమైతున్నరు అంటే.. ఆయన నేను పండవొట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంట.. పెండ మోకానికి రాసుకుంట.. చీరుత.. సంపుత.. మానవ బాంబునైత.. మట్టిబాంబునైత అని మాట్లాడుతున్నడు. ఇంత అసహనమా..? అంటూ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు (Kcr Meeting) కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కుతోచని స్థితిలో, భయంకరమైన కరువు కాటలతో కరెంటు కోతలతో.. ఆత్మహత్యలకు, వలసలకు ఆలవాలమైన తెలంగాణను ఎట్లా అభివృద్ది చేశామో విూకందరికి తెలుసని అన్నారు. తెలంగాణ.. దశ దిశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటించాం. ఆ రోజు ఎవరికీ విశ్వాసం లేదు. తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దనే ఆంక్షలు’ ఉండేవని గుర్తు చేశారు. ఆ రోజు నాకున్న పదవులన్నీ విసిరివాళ్ల మోఖానపడేసి తెలంగాణ కచ్చితంగా నిలబడాలి.. కలబడాలి.. సొంత రాష్ట్రం కావాలి.. సొంత రాష్ట్రమైతే తప్ప దిక్కులేదని.. ఒక్కడిగా.. సైన్యంగా.. పిడికెడు మందితో జై తెలంగాణ అని బయలుదేరినం. హైదరాబాద్‌లో చర్చోపచర్చలు. ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రజాగర్జన కావాలి. బ్రహ్మాండమైన చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పి ఇదే ఎస్సారార్ కళాశాల మైదానంలో.. ఇదే రాత్రి సమయంలో మే 17న 48 డిగ్రీల ఎండ. అయినా తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని వస్తే ఆనాడు వస్తే తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తు ఎత్తిన గడ్డ ఈ గడ్డ. ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని.. పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి ఉద్యమం కోసం బయలుదేరినట్లు వివరించారు. ఆ తర్వాత కథంతా విూకు తెలుసు. ముందుండి విూరే నన్ను నడిపించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ. మాతోని నువ్వు గెలిచినవ్ కేసీఆర్.. నీ లెక్కేది.. బిషాద్ ఏంది అని మాట్లాడితే ఆ నాడు కేంద్రమంత్రి పదవి, ఎంపీ పదవి నేలకేసి కొట్టి రార నా కొడకా కరీంనగర్‌కు అని మళ్లీ ఇక్కడికి వచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో.. ఎన్ని మాయోపాయాలు చేశారో.. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందే నాకంటే విూకే తెలుసు.