BRS candidate” మాజీ డిప్యూటి స్పీక్ పేరును ఖరారు చేసిన కెసిఆర్
ఇంకా తేలని భువనగిరి, నల్లగొండ, హైదరాబాద్
హైదరాబాద్,మార్చి23 :
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి (BRS candidate) బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్‌ను బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంపి అభ్యర్థిగా ఎంపిక చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం మేరకు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు. ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. మొన్నటి ఎన్నికల్లో పద్మారావు గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో డిప్యూటి స్పీకర్‌గా కూడ ఆపనిచేశారు. వివాద రహితుడిగా పేరుంది. తలసాని కుటుంబం నుంచి ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో పద్మారావును ఎంపిక చేయాల్సి వచ్చింది. ఇకపోతే ఇప్పటికే నాగర్‌కర్నూల్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మల్కాజ్‌గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు. పలువురు ఎంపిలు ఇప్పటికే పార్టీలు మారారు. దీంతో (BRS candidate) బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు.
సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్థుత శాసన సభ్యుడు @TPadmaRao ను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం… pic.twitter.com/8t1OkuGuyy
— BRS Party (@BRSparty) March 23, 2024
lemur Video” గోకండి నాయన.. అడిగి మరీ.. అడవి జంతువు వీడియో వైరల్
Car Helicopter” కారును హెలికాప్టర్ గా మార్చేశారు… వీడియో వైరల్
Governor of Telangana” తెలంగాణ కొత్త గవర్నర్‌గా రాధాకృష్ణన్