Governor of Telangana” తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళసౌ సౌందరరాజన్ తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆ వెంటనే జార్కండ్ గవర్నర్ సీపీ రాథాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా గవర్నర్ సీపీ రాధాకృష్ణను తాత్కాలికంగా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం రోజున ఆదేశాలు జారీ చేసింది. అయితే బీజేపీ నాయకత్వం తమిళిసై సౌందర రాజన్ కు ఏ స్థానం కేటాయిస్తారనేది త్వరలోనే తేలనుంది. తెలంగాణ గవర్నర్ పదవిని చేపట్టడానికి ముందుగా తమిళిసై సౌందర రాజన్ బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Lion viral video” సింహం ఆప్యాయంగా హత్తుకుంటూ… వీడియో వైరల్