Cyberabad Police” చిన్నపిల్లలు స్కూల్‌కి వెళ్లే సందర్భంలో కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి.. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు ప్రమాదం జరిగితే ఆ బాధ వర్ణాణాతీతం.. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించొచ్చు అని పోలీసులు తరచూ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటారు. తాజాగా కూడా సైబరాబాద్ పోలీసులు స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ఓ పలు సూచనలు చేశారు. మీ పిల్లలు స్కూల్ కి సురక్షితంగా వెళ్ళేలా జాగ్రతలు తీసుకుంటున్నారా..? అంటూ (Cyberabad) సైబరాబాద్ పోలీసులు ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. వాహన డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రుల పొరపాటు వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. స్కూల్ బస్సు, ఆటల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించకూడదని సూచించారు. బస్సు దిగిన వెంటనే ముందు నుంచి గానీ, వెనుక నుంచి గానీ దాటకూడదని సూచించారు.
మీ పిల్లలు స్కూల్ కి సురక్షితంగా వెళ్ళేలా జాగ్రతలు తీసుకుంటున్నారా?#RoadSafety pic.twitter.com/WcWXTMj3Dh
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) June 21, 2024
చేతులు బయటపెట్టడం కానీ, బ్యాగులు బయట తగిలియడం కానీ చేయకూడదని తెలిపారు. డ్రంక్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ రాంగ్ సైడ్ డ్రైవ్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ఉల్లంఘలు చేసిన వారిని డ్రైవర్లుగా నియమించుకోడదని పేర్కొన్నారు. అనుభవం ఉన్నవారిని డ్రైవర్లుగా నియమించుకోవాలన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉందో పిల్లలను అడిగి తెలుసుకోవాలన్నారు. తల్లి దండ్రులు పిల్లలను బైక్ తీసుకెళ్తున్నప్పుడు పిల్లలకూ హెల్మెట్ ధరింప చేయాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు చేయకూడదని వివరించారు. ఓవర్ స్పీడ్‌గా వెళ్లొద్దన్నారు. స్కూల్ యాజమాన్యం పాఠశాల ఎదుట వాచ్ మెన్ ఉంచి పిల్లలను సురక్షితంగా లోపలికి వెళ్లేలా చూసుకోవాలి. పిల్లలకు రోడ్డు భద్రతా విద్య పై అవగాహన కల్పించాలని కోరారు.
ఇవి కూడా చదవండి
Hajj Pilgrimage” హజ్ యాత్రలో విషాదం.. ఎండ వేడికి 1000కి పైగా మృతి
Viral news” ఓరినాయనో అది బైకా.. బస్సా.. రూ. 9,500 ఫైన్
Snake Viral Video” వామ్మో పాము.. కొరియర్‌లో వచ్చిన విషపూరిత పాము
Bridge Collapsed” కండ్ల ముందే కుప్పుకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్
Miyapur Case” తండ్రే హంతకుడు .. 12 ఏళ్ల మైనర్ బాలిక హత్య కేసులో దారుణం..
Train Vrial Video” రైలుపక్కన సెల్ఫీ దిగాలని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైరల్