Bihar Bridge” బిహార్‌లోని పలు బ్రిడ్జిలు పేకమేడల్లా పుటుక్కుమని కూలుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి పోటీపడి కూలిపోతున్నాయి. గడిచిన 17 రోజుల్లో బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 12 వంతెనలు కూలిపోయాయి. తాజాగా మరో వంతెన కూలిపోయింది. సరన్ అనే జిల్లాను సివాన్ జిల్లాను కలుపుతూ గండకి రివర్‌పై కట్టిన 15 ఏండ్ల కిందటి బ్రిడ్జి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై సంబధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సరన్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మూడు బ్రిడ్జిలు కూలిపోయినట్టు అధికారులు చెప్పారు. మొత్తంగా 17 రోజుల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి. తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ మధుబని, అరారియా జిల్లాల్లోనూ బ్రిడ్జిలు కూలాయి. భారీ వర్షాలు, నీటి ప్రవాహం పెరిగిన సమయంలో బ్రిడ్జిలు కూలుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Viral video” జెర్రుంటే సచ్చిపోతుండే.. భూమ్మీద నూకలు ఉండడం అంటే ఇదే.. వీడియో వైరల్
Nagar kurnool news” ఘోర విషాదం… మట్టి ఇల్లు కూలి ఒకే ఇంట్లో నలుగురు మృతి
Viral video” సముద్రంలో ఇరుక్కున్న థార్స్… రీల్స్ కోసమేనా..? వైరల్ వీడియో