Tuesday , 22 October 2024
Breaking News
Cyber crime

Cyber crime” ఆ మోసాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి.. తెలంగాణ పోలీస్ ట్వీట్

Cyber crime” అమాయ‌క‌త్వాన్ని ఆస‌రా చేసుకుని మోస‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా మోసం చేసేవాడు ఏదో ఓ రూపంలో మ‌న చుట్టే తిరుగుతుంటాడు. వాడు క‌న‌ప‌డ‌కుండానే,వాడెవ‌డో తెల్వ‌కుండానే జ‌నాల‌ను ద‌ర్జాగా లూటీ చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో సైబ‌ర్ నేరాలు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత అవ‌గాహ‌న కల్పించినా నిత్యం ఎక్క‌డో ఓ చోట అమాకులు బ‌ల‌వుతున్నారు. తాజాగా మ‌రో కొత్త ర‌కం మోసంపై తెలంగా పోలీసులు ట్వీట్ చేశారు. కొరియర్/ పార్సిల్ పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాల‌ని ఎక్స్ వేదిక‌గా సూచించారు. మీ పేరున కొరియ‌ర్ వ‌చ్చింద‌ని అజ్ఞాత వ్య‌క్తులు ఫోన్ చేస్తార‌ని తెలిపారు. ఆ కొరియర్‌లో డ్ర‌గ్స్‌, వ‌స్తువులు ఉన్నాయ‌ని చెబుతార‌న్నారు. తాము పోలీసుల‌మ‌ని అరెస్టు చేస్తామ‌ని భ‌య‌పెడుతారని వివ‌రించారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు పోలీసుల దృష్టికి తీసుకురావాల‌ని కోరారు. సైబర్ నేరాలకు బాధితులుగా మారితే గందరగోళానికి గురవకుండా వెంటనే #Dial1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. అప్రమత్తతే మన ఆయుధ‌మ‌ని ఎక్స్ వేదిక‌గా అవగాహ‌న కల్పించారు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి
Bihar Bridge” ఇది 12వ‌ది.. వ‌రుస‌గా కూలుతున్న బ్రిడ్జిలు

Crime news” అతివేగానికి యువకుడు బలి.. ప‌రిమితంతో వాహ‌నాల‌ను న‌డ‌పాలి.,. తెలంగాణ పోలీస్ సూచ‌న వీడియో పోస్ట్

Viral video” జెర్రుంటే స‌చ్చిపోతుండే.. భూమ్మీద నూక‌లు ఉండ‌డం అంటే ఇదే.. వీడియో వైర‌ల్

Viral Video” ఎంట‌మ్మా అంత తొంద‌రా..? దూసుకొచ్చిన రైలు.. కొంచెం ఉంటే పిల్ల‌ల‌తో స‌హా ప్రాణాలు పోయేవి.. వీడియో వైర‌ల్‌

Lonovala Bhusi Dam” కండ్ల ముందే నీళ్ల‌లో కొట్టుకుపోయిన కుటుంబం.. వీడియో

About Dc Telugu

Check Also

22.10.2024 D.C Telugau cinema

22.10.2024 D.C Telugu Morning

20.10.2024 D.C Telugau Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com