Thirupathi Crime news” తనకు ఇష్టం లేని పెండ్లి చేశారని అన్న కుటుంబాన్ని హత్య చేసి తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుడిమెట్ల మోహన్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతని అన్న ఇంట్లో లేని సమయంలో అన్న ఇంటికి వచ్చిన మోహన్ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. కత్తితో వదిన సునీత , ఇద్దరు పిల్లలు దేవిశ్రీ, నీరజపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు. తర్వాత అదే గదిలో మోహన్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోహన్‌కు ఇష్టం లేని పెండ్లి చేశారనే కక్షతోనే దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు పెళ్లై బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తలు విడిపోడం, అన్న కుటుంబం సంతోషంగా ఉండటాన్ని మోహన్ జీర్జించుకోలేకనే ఇలా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
RoadSafety” పార్క్ చేసిన వాహనాల దగ్గర ఉంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి..
Ktr” కెసిఆర్ పోరాటం రామాయణమంత : కేటీఆర్
Fire Accident” హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి