Bogota Falls” బొగత జలపాతం వ‌ద్ద విషాదం… యువకుడు మృతి

Bogota Falls

Bogota Falls”  స‌ర‌దాగా జ‌లపాతం వ‌ద్ద‌కు వెళ్లిన యువ‌కుడిని విషాదం వెంటాడింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వ‌ద్ద మంగ‌ళ‌వారం ఓ యువ‌కుడు మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఏనుముల మార్కెట్ సుందరయ్య నగర్ ఏరియాకు చెందిన బొనగాని జస్వంత్ (19) త‌న స్నేహితులైన ప్రశాంత్, నాగేందర్, సాయికిరణ్ తో బొగత జలపాతం అందాలు చూసేందుకు వెళ్లారు. ఆ త‌రువాత స‌ర‌దాగా జలపాతం వ‌ద్ద ఏర్పాటు చేసిన స్థ‌లంలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. నీటిలో దిగిన కొద్ది సేప‌టికే ప్రవాహం ఎక్కువ‌గా ఉండ‌డంతో జస్వంత్ నీళ్ల‌లో కొట్టుకుపోయాడు. స‌మాచారం అందుకున్న వెంకటాపురం పోలీసులు గజ ఈతగాళ్ళతో వెతికించారు. సాయంత్రానికి డెడ్ బాడీని వెలికి తీశారు.

 

ఇవి కూడా చ‌దవండి

Budget 2024″ బంగారం, మొబైల్ ఫోన్లపై సుంకాల తగ్గింపు

Budget 2024″ బడ్జెట్ 2024 కొత్త పన్ను విధానంలో శ్లాబులు మారిన‌య్

Hyderabad News” ఓల్డ్ సిటీలో విరిగిప‌డ్డ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు

Upsc exams” ప్రిలిమ్స్ పాసైనోళ్ల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం

Shocking Road Accident” వేగంగా బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఎగిరిప‌డ్డ దంప‌తులు.. సీసీ టీవీ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *