Ktr” కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై చేసిన పోరాటం రాసుకుంటే రామాయణమంతా అని.. చెప్పుకుంటే భారతమంత అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూనియన్ బడ్జెట్‌లో తెలంగాణాకు జరిగిన అన్యాయంపై ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లో రెండు రాష్టాల్రకు హావిూ ఇచ్చారని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఒక రాష్టాన్రికి చేయూతనిచ్చి.. ఇంకొక రాష్టాన్రికి మొండి చేయిచూపడం అన్యాయమన్నారు. పక్కరాష్ట్రమైన ఆంధ్రాకు డబ్బులు ఇవ్వడం సంతోషమే న్నారు. పక్క వారు బాగుపడితే సంతోషిస్తామన్నారు. కానీ మనకు ఇవ్వలేదనే బాధ తెలంగాణలోని ప్రతిబిడ్డలో ఉన్నదన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇంత చిన్నచూపా అనే అవేదన ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను ఎవరు హరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. తెలంగాణా విషయంలో ఎటువంటి అన్యాయం జరిగినా ముందుండి కొట్లాడే బాధ్యత ఈ గడ్డమీద పుట్టిన పార్టీగా బీఆర్‌ఎస్‌దేననే మాట గుర్తు చేస్తున్నాన్నారు. కేసీఆర్ పోరాటం గురించి.. ఆయన చేసిన కార్యక్రమాలు చెప్పాలంటే.. రాసుకుంటే రామాయణమంతా అని చెప్పారు. చెప్పుకుంటే పోతే భారతమంతా అంత కథ ఉందన్నారు. తెలంగాణాకు జరిగిన అనేక విషయాల్లో బీఆర్ ఎస్ పార్టీ ముందుండి పోరాడిందన్నారు.
ఇవి కూడా చదవండి
New movies” ఆగస్ట్‌లో సినిమా ప్రియులకు పండగే..
Plane Crash” టేకాఫ్ అవుతూ ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి.. వీడియో
Whale Viral Video” బోటుపై దాడి చేసిన భారీ తిమింగలం.. వీడియో వైరల్
Ethiopia Landslides” కొండచరియలు విరిగిపడి పెను విషాదం.. 229 మంది మృతి