New Airports in Telangana” తెలంగాణాలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు సందడి నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రాజధాని హైదరాబాద్‌లో మాత్రమే (Airport) విమానాశ్రయం ఉంది. శంషాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రాకముందు బేగంపేట లో జాతీయ స్థాయి విమానాశ్రయం ఉండేది. రాష్ట్రంలోని ప్రయాణికులు విమానం ఎక్కాలంటే పట్నం దాకా పోవాల్సిందే.. అయితే ఇప్పుడు మరో నాలుగు ఎయిర్‌పోర్టులు (Airport) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రప్రభుత్వం విమానాశ్రాయల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతున్నది. తెలంగాణ సీఎం ఇతర మంత్రులు ఇటీవలే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో సమావేశమయ్యారు. నాలుగు పట్టణాల్లో ఎయిర్‌పోర్టులను త్వరగా అభివృద్ధి చేయాలని కోరారు. దీనికి కేంద్ర పౌరవిమానశాఖ మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. తెలంగాణాలో రెండో అతిపెద్ద నగరమైన (Warangal) వరంగల్‌లో ముందుగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఇక (Bhadradi Kothagudem) భద్రాద్రి కొత్తగూడెం, (Peddapalli) పెద్దపల్లి, (Adilabad) ఆదిలాబాద్ ప్రాంతాల్లోనూ విమానాశ్రాయాల నిర్మాణం చేపట్టనున్నారు. త్వరగా భూసేకరణ పూర్తయితే అంత త్వరగా ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు చేపడుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఎన్డీయే కూటమి గవర్నమెంట్లోనే వరంగల్ ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ఫాజిబిలిటీ అధ్యాయనం చేయాల్సి ఉందన్నారు. అలాగే ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అటు చత్తీస్‌గడ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భూసేకరణ పూర్తయి ఎటువంటి ఆటంకాలు లేకపోతే త్వరలోనే తెలంగాణ పల్లె ప్రజలు విమానాల్లోనూ సుదూర ప్రాంతాలను త్వరగా చేరుకోవచ్చు.
పై ఫోన్‌ను అమెజాన్‌లోకొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3Oq5Fhs
హారిస్ & కో. క్లాక్‌మాస్టర్స్ లక్స్ ఎడిషన్ ప్రీమియమ్ లగ్జరీ బ్యాటరీ థిక్ మెటల్ ఫ్రేమ్ & ఆటోమేటిక్ లైట్ గ్లోతో పనిచేసే వాల్ క్లాక్
ఈ క్లాక్ ను అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3Zbe9OF
ఇవి కూడా చదవండి
Sugar” ఈ చక్కెర తీరే వేరు.. ఎంత తిన్నా షుగర్ పెరగదు..
Samsung Monitor” సాంసంగ్ 27 ఇంచుల మానిటర్ కేవలం 9,999 రూపాయలే..
Integrated residential schools” ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూళ్లు.. ఎక్కడెక్కడంటే..
Meerut Viral Video” పెండ్లి కొడుకు మెడలో నోట్ల దండ.. ఎత్తుకెళ్లిన ట్రక్కు డ్రైవర్
CC camera” మీ ఇంటి భద్రత కోసం ఫిలీప్స్ సీసీ కెమెరా… అమెజాన్‌లో తక్కువ ధరకే..
Meerut Viral Video” పెండ్లి కొడుకు మెడలో నోట్ల దండ.. ఎత్తుకెళ్లిన ట్రక్కు డ్రైవర్