PM Fasal Bima Yojana” రైతుల‌కు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

PM Fasal Bima Yojana

PM Fasal Bima Yojana”  దేశవ్యాప్తంగా రైతుల కోసం చేపట్టిన.. పీఎం ఫసల్‌ భీమా యోజన పథకాన్ని పొడిగించాలని కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసింది. కేంద్ర కేబినెట్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ మీటింగ్‌లో కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న‌ది. కేంద్ర (Cabinet)  క్యాబినెట్ భేటీలో పలు ముఖ్య‌మైన నిర్ణయాలు తీసుకున్నారు. పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి (Fasal Bima Yojana) ఫసల్‌ బీమా యోజనను మరింతగా మెరుగుపరచాలని నిర్ణయించారు. కేటాయింపులను 69,515 కోట్ల రూపాయ‌ల‌కు కు పెంచుతూ ఆమోదించింది. దీనివ‌ల్ల రైతుల పంటలకు మరింత రక్షణ లభించడంతో పాటు నష్టాల పట్ల ఆందోళన తగ్గనుంది. 50 కిలోల (DAP) డీఏపీ ఎరువుల బస్తాను రూ.1,350 చొప్పున రైతులకు అందజేసేందుకు రూ.3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల (Cabinet) కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. 2025లో తొలి క్యాబినెట్‌ భేటీని ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు అంకితం చేశారన్న అశ్వినీ వైష్ణవ్‌.. రైతుల సంక్షేమం గురించి ఈ భేటీలో చర్చ జరిగిందన్నారు. రెండు పంటల బీమా పథకాలను కేంద్రం 2025-26 వరకు పొడిగించినట్లు తెలిపారు. వీటిని 15వ ఆర్థిక సంఘం కాలానికనుగుణంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాలకు 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు రూ.66,550 కోట్లు కేటాయించగా.. దాన్ని 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ.69,515.71 కోట్లకు పెంచారు. ఈ పంటల బీమా పథకాల అమలులో సాంకేతికతను వినియోగించేందుకు రూ.824.77 కోట్ల కార్పస్‌తో ప్రత్యేక నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం (Cabinet)  తెలిపిందన్నారు. ఈ టెక్నాలజీ వినియోగంతో పంట నష్టం అంచనాలను త్వరగా తెలుసుకోవడంతో పాటు క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌, వివాదాలను తగ్గించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. (Cabinet) క్యాబినెట్‌ నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణం. 2025 మొదటి క్యాబినెట్‌ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశాం. వారి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభమైన తొలి రోజు భేటీ అయిన.. ఈ తొలి కేబినెట్‌ను రైతులకు అంకితం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించిందని చెప్పారు. ఇక (PradhanaMantri) ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. (DAP) డీఏపీ ఎరువులపై అదనపు భారాన్ని భరించాలని కేంద్రం నిర్ణయించిందని సోదాహరణగా ఆయన వివరించారు. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి గతేడాది వరకు.. అంటే 2024 చివరి వరకు.. ఎరువుల సబ్సీడీ కింద రూ. 11.9 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. అదే విధంగా 2024లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రైతుల కోసం రూ. 6 లక్షల కోట్ల విలువైన 23 కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది.

మ‌రిన్ని ఇంట్ర‌స్టింగ్ క‌థ‌నాల కోసం మా వాట్స‌ప్ చానెల్‌ను ఫాలో చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

realme GT 7 Pro Smart Phone” రియ‌ల్ మీ జీటీ ప్రో .. మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్

LG Smart LED TV” 65 ఇంచులు 64 వేల రూపాయ‌లు.. ఎల్జీ స్మార్ట్ టీవీ

Modern Wall Clock” మెగా హోం సేల్.. మోడ్ర‌న్ వాల్ క్లాక్ 199 నుంచే ప్రారంభం

Lava Agni 3 5G Smart Phone” లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్‌..11 శాతం త‌గ్గింపుతో ₹24,998

LG Smart LED TV” 43 ఇంచుల ఎల్ జీ స్మార్ట్ టీవీ కేవంల 30 వేల‌ల్లో.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *