Cinema”నూడుల్స్‌ తిని కాలం గ‌డిపాం

Cinema” పాత జ్ఞాపకాలు నెమరేసుకున్న దియావిూర్జా
కెరీర్‌ బిగినింగ్‌లో సవాళ్లు ఎదుర్కోవడం ఎలాంటి ఆర్టిస్ట్‌కైనా సహజమే. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్‌ అయినా కావచ్చు కెరీర్‌ బిగినింగ్‌లో ఇబ్బందులు సహజంగానే ఉంటాయి. మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు నటి దియా విూర్జా చెప్పారు. ఆ సమయంలో చేతిలో డబ్బుల్లేక ఇబ్బందిపడ్డానని ఆమె అన్నారు. ‘2000లో నేను, ప్రియాంకా చోప్రా, లారా దత్తా.. మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రియాంకకు కుటుంబ సభ్యుల నుంచి ఎంతో సపోర్ట్‌ ఉండేది. మాకు సపోర్ట్‌ చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. మోడలింగ్‌లో రాణిస్తోన్న కారణంగా
అప్పటికే లారా ముంబయిలో ఒక ఇరికింట్లో అద్దెకు ఉండేది. నేను ముంబయి వచ్చినప్పుడు.. ఆమె నాకెంతో సాయంగా నిలిచింది. తన రూమ్‌లో ఉండేందుకు అవకాశం కల్పించింది. చిన్న ఇల్లే అయినప్పటికీ మేమిద్దరం సర్దుకుపోయాం. ఫ్యాషన్‌ షోల్లో పాల్గొని.. ఖరీదైన దుస్తులు ధరించి నప్పటికీ ఒక్కోసారి చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. చాలీచాలని డబ్బుతోనే జీవితాన్ని కొనసాగించాం. కొన్నిసార్లు నూడుల్స్‌ తిని కడుపు నింపుకున్నాం. అలా చాలా రోజులు గడిపాం. మా పరిస్థితిని తలుచుకొని నవ్వుకునేవాళ్లం. ఖరీదైన దుస్తులు వేసుకున్నా.. తినేది మాత్రం నూడుల్స్‌ అనుకునేవాళ్లం’ అని దియావిూర్జా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. 2000 మిస్‌ ఇండియా పోటీల్లో లారా దత్తా విజేతగా కిరీటాన్ని అందుకోగా.. ఫస్ట్‌ రన్నరప్‌గా ప్రియాంకా చోప్రా, సెకండ్‌ రన్నరప్‌గా దియా విూర్జా నిలిచారు. 2001లో విడుదలైన ‘రెహ్నా హై తేరే దిల్‌ మే’తో ఇండస్టీల్రోకి అడుగుపెట్టారు దియా విూర్జా. అనంతరం ఆమె బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేశారు. 2021లో విడుదలైన ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమాలో ఆమె నటించారు.

13.03.2025 DC ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వార్త‌లు

Mankondur”మృతుడి భార్యకు గాయత్రి బ్యాంక్ చెక్కు అందజేత..

Peddapalli” 436 రూపాయల ప్రీమియం తో 2 లక్షల బీమా: పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

Cinema News” నిన్న‌టి నుంచి ట్రెండింగ్‌.. టాలీవుడ్‌ను ఏలేదీ ఆ అమ్మాయే

Integrated BED” ఇంట‌ర్ త‌ర్వాత.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోసం ఎలా అప్ల‌య్ చేయాలంటే..?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *