Sree leela” యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కవే. ఈ నటి తన అందంతో ఎంతో మంది మదిని దోచింది. పెళ్లిసందడి సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అంతే కాకుండా మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది ఈ నటి. ఈ మూవీ తర్వాత శ్రీలీలకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. ముఖ్యంగా రవితేజ ధమాక సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు డ్యాన్స్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీలీల గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఎక్స్ టాఆర్డినరీ బ్యాన్ ఇలా వరస సినిమాలు చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. వరసగా ఆఫర్స్ వచ్చినా అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో ఒక్కసారిగా శ్రీలీల క్రేజ్ తగ్గిపోయింది. దీంతో అవకాశాలు కూడా అంతగా లేకపోవడంతో ఈ అమ్మడు కాస్త సైలెంట్ అయ్యింది. పుష్ప 2 సినిమాలో కిసక్కీ అంటూ తన డ్యాన్స్ గ్లామర్‌తో తెలుగు అభిమానులను పలకరించిన శ్రీలీల మరోసారి రాబిన్ హుడ్ మూవీ ద్వారా థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న శ్రీలీల స్కైబ్లూ కలర్ చీరలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ శారీలో ఈ ముద్దుగుమ్మ అందాలను చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది కిసక్కీ బ్యూటీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ నీలిరంగు చీరలో చందమామలా చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Bhagyashree”వరుస ఆఫర్లతో భాగ్యశ్రీ.. ఈ ఏడాది చివరలో కాంత
Karimnagar news” సిట్ ఏర్పాటు నిర్ణయంపై ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి హర్షం..
Current Affairs” ఈశాన్య రాష్ట్రంలోని నగరం పేరుతో ఉన్న యుద్దనౌక ఏదీ..? పోటీ పరీక్షల ప్రత్యేకం